నెలవారీ నేర సమీక్ష సమావేశం — దర్యాప్తు పురోగతిపై ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలు.


 నెలవారీ నేర సమీక్ష సమావేశం — దర్యాప్తు పురోగతిపై ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్).

పి. మలేహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :13 అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా గత నెలలో నమోదైన వివిధ నేరల కేసులపై దర్యాప్తు పురోగతి, పెండింగ్ వారెంట్లు, తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై పర్యవేక్షణ, NDPS కేసుల అనుసరణ, సైబర్ నేరాలు, SC/ST, POCSO, 304(B) కేసులు, సోషల్ మీడియా కేసులు, ట్రాఫిక్ అమలు చర్యలు తదితర అంశాలపై విపులంగా సమీక్షించారు.

*ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ—* 

“కేసు నమోదు అయినప్పటి నుండి చార్జ్‌షీట్ దాఖలు చేసే దశ వరకు, దర్యాప్తు అధికారులు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు, డాక్యుమెంటరీ ఆధారాలు, సాంకేతిక ఆధారాలను సమగ్రంగా సేకరించి దర్యాప్తును పటిష్టంగా నిర్వహించాలని, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.”

పెండింగ్ NDPS కేసులు విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని, అరెస్ట్ అయిన నిందితులతో ఛార్జ్ షీట్ వేయ్యాలన్నారు. అదే కేసులో తప్పించి తిరుగుతున్న నిందితులు అరెస్ట్ అయిన వెంటనే స్ప్లిట్ చార్జ్ షీట్ వేయాలన్నారు. ప్రొసీజర్ ప్రకారం కోర్టు లలో శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

 UI కేసుల వేగవంతమైన ప్రాసెస్, పేడ్లర్లు–కన్జూమర్లపై కఠిన చర్యలు, ఆస్తి గుర్తింపు మరియు ఆర్థిక దర్యాప్తు వంటి అంశాల్లో నిర్లక్ష్యం జరగకూడదని ఆదేశించారు.

గ్రేవ్ కేసులు, ముఖ్యంగా మృతదేహ పరిశీలనలు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల సేకరణలో ఆలస్యం లేకుండా ప్రతి కేసును ఫోకస్‌తో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సైబర్ క్రైమ్ కేసుల విషయంలో బాధితులకు వెంటనే స్పందించడం, డబ్బు ఫ్రీజింగ్ ప్రక్రియ వేగవంతం చేయడం, 1930 హెల్ప్‌లైన్ ప్రచారం మరింత బలపరచాలని తెలిపారు.

112 రెస్పాన్స్ టైం మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ–చలాన్లు, ఓపెన్ డ్రింకింగ్‌పై అమలు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

PGRS కంప్లైంట్లను త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు.

ఎస్పీ అన్ని విచారణాధికారులకు సంబంధిత కేసుల CD ఫైళ్ళు సమీక్షించి సమగ్ర పారదర్శక దర్యాప్తుతో నేరాల నియంత్రణ, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులు అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి,

నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాస రావు, ఇన్స్పెక్టర్లు: బెండి వెంకటరావు, ఆర్.మల్లికార్జున రావు, ఎల్.రేవతమ్మ, పి.అప్పల రాజు, టి.విజయ, ఎల్.మన్మధరావు, ఎస్సైలు మరియు మరియు సిబ్బంది మొత్తం 44 మందికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. 

ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ రాఘవరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, లక్ష్మీ, గఫూర్, రామకృష్ణారావు, మన్మధరావు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post