విజయవాడ స్వాతీ ప్రెస్ దగ్గర నడి రోడ్డు లో మహిళ దారుణ హత్య.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా గొంతులో పొడిచి చంపిన భర్త.
తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందిన మహిళ.
మృతురాలు విజయవాడ విన్స్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిగా గుర్తించిన పోలీస్ లు.
గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవ. సరస్వతి పై తీవ్ర కోపం పెంచుకొని హాస్పెటల్ నుంచి వెడుతున్న సరస్వతిని నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త.
అక్కడున్నవారు సమాచారం తో హంతకుని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
