అనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు: ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి.మహేశ్వరరావు.అనకాపల్లి,(చోడవరం) నవంబర్ 13:ఇటీవల కాలంలో చోడవరం, బుచ్చియ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వరుసగా, రాత్రి వేళల్లో దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను చోడవరం పోలీస్ వారు పట్టుకొని వారి వద్ద నుండి మొత్తం 26 కేసుల్లో దొంగతనాలకు గురైన 10.32 గ్రాములు బంగారం, 26 తులాల వెండి, మరియు నగరు రూ.44,218/- మొత్తం సుమారు రూ.66,418/- విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగినది. పై కేసుల్లో ఒకరు మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారు.
నిందితులు జల్సాలకు అలవాటు పడి, దేవాలయాలను టార్గెట్ చేస్తూ, రాత్రి వేళల్లో హుండీ దొంగతనాలకు పాల్పడేవారు. నేరస్థలంలో దొరికిన ఆనవాళ్ళు ఆధారాలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి పట్టుకోవడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు విజయవంతమయ్యారు. బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలానికి నిందితులు జల్సాలకు అలవాటు, చెడు వ్యసనాలకు బానిసై, ఈ హుండీ చోరీలకు పాల్పడి, దొంగలించిన వాటిలో కొంత వారి అవసరాలు ఖర్చు చేసుకొని మిగతా డబ్బు, బంగారం, వెండిని విజయరామరాజుపేట ఏరియాలో దాచి ఉంచి, ఈ దినం ఫై ముగ్గురు బైకే ఫై వడ్డాది నుండి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీస్ వారు చోడవరం గ్రామా శివారులో గౌరిపట్నం వద్ద నిందితులను పట్టుకోవడం జరిగినది. వీరిలో మొదటి ముగ్గురు అన్ని నేరాలకు పాల్పడగా, 4వ వ్యక్తి ఒక్క నేరానికి మాత్రమే పాల్పడినాడు.
*పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన కేసులు:* *చోడవరం -02,* *బుచ్చియ్యపేట-11,* *వి.మాడుగుల-09,* *చీడికాడ-02,* *దేవరాపల్లి-02,* *మొత్తం-26కేసులు*
ఈ కేసులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, దిశానిర్దేశనలో, అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్.మోహనరావు పర్యవేక్షణలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి ఆద్వర్యంలో చోడవరం ఇన్స్పెక్టర్ శ్రీ పి.అప్పలరాజు, ఎస్సై బి.నాగకార్తీక్, ఎస్సై బి.జోగారావు మరియు పోలీస్ సిబ్బంది తో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించడం, ఈ సందర్భంగా అధికారులకు ప్రశంసా పత్రాలతో అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... “ఇలాంటి సంఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించడం, తమ ఇంట్లో విలువైన డబ్బు, బంగారం బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. తమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బయటి ప్రాంతాలకు వెళ్ళేవారు స్థానిక పోలీసులతో కలిసి ఎల్.హెచ్.ఎం.ఎస్ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సేవలు వినియోగించుకోవాలన్నారు. అలాగే అన్ని దేవాలయాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రత లేదని దేవాలయాల్లో విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, నేరాలపై కఠిన చర్యలు ఉంటాయని ఉంటాయని తెలియజేసారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పాటు, అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం ఇన్స్పెక్టర్ పి.అప్పలరాజు, ఎస్సై బి.నాగకార్తీక్, ఎస్సై బి.జోగారావు, సిబ్బంది పాల్గొన్నారు

