వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – దేశభక్తికి నాంది.


 వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – దేశభక్తికి నాంది.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్.

పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :07

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో “వందేమాతరం” గీతాలపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, శఎల్.మోహన రావు మరియు పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల్లో అజేయ స్పూర్తిని నింపిన జాతీయ గేయం “వందేమాతరం”కు నేటితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. 1875 నవంబర్ 7న మహాకవి బంకింఛంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం తొలిసారిగా ఆయన రచించిన 'ఆనంద్ మఠ్' నవలలో ప్రచురితమైంది. దేశభక్తిని పెంపొందించే ఈ గేయాన్ని స్మరించుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు “వందేమాతరం” గీతాన్ని ఏక స్వరంతో ఆలపించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ తరఫున పోలీసులు దేశభక్తి భావనతో సేవలందించాలని, ప్రజలు కూడా స్వాతంత్ర్య పోరాట చరిత్రను స్మరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు తో పాటు ఇన్స్పెక్టర్లు లక్ష్మి, రమేష్, ఎస్సైలు సురేష్ బాబు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post