స్కూల్‌ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - బొబ్బిలి ఎస్సై రమేష్.



  స్కూల్‌ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - బొబ్బిలి ఎస్సై రమేష్.
నవంబర్ 24. క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీను.
విజయనగరం జిల్లా... బొబ్బిలి మండలం.పక్కి హై స్కూల్‌ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం:మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలు, సైబర్ నేరాలపై ఎస్సై రమేష్ సూచనలు.

పక్కి:పక్కి హై స్కూల్‌లో స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై రమేష్ విద్యార్థులకు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మత్తు పదార్థాలు విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన అలవాటులు అని హెచ్చరిస్తూ,చిన్న వయస్సులోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,మంచి స్నేహితులను ఎంచుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వద్దని సూచించారు.అలాగే సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, తెలియని లింకులు, ఫేక్ ఐడీలు, అనుమానాస్పద సందేశాలు సైబర్ నేరాలకు దారితీస్తాయని వివరించారు.

విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై  రమేష్ మాట్లాడుతూ, *“విద్యార్థి దశలో స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకుని,ఆ లక్ష్యాల దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. జీవితాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకే ఉంది”* అని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక హామీలను కూడా ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా ఎస్పీ గారి చేతుల మీదగా సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాక, 592 మార్కులు దాటిన ప్రతీ విద్యార్థికి ప్రతేక బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

సామాజిక బాధ్యతగా, తల్లి–తండ్రులు లేని ఒక పేద విద్యార్థిని తాను దత్తత తీసుకున్నట్లు ఎస్సై రమేష్ వెల్లడించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నరు.ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post