క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ 07:
అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సంఘం సభ్యులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మర్యాదపూర్వకంగా కలిసి, పోలీస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల విస్తరణపై సానుకూల చర్చలు జరిపారు.ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సంఘం తరఫున ప్రతిపాదనలు సమర్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఉత్సాహంగా స్పందిస్తూ, పోలీస్ కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా, భవిష్యత్తులో కూడా సిబ్బంది శ్రేయస్సుకు దోహదపడే ప్రణాళికలు రూపొందించేందుకు సంఘం పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడితో పాటు ఎస్సై శేషగిరి రావు, సత్యనారాయణ, అచ్చయ్య, శేషాద్రి, శ్రీధర్, లలిత, మల్లేశ్వరి తదితర సభ్యులు పాల్గొన్నారు.
