గౌరీ పూజలు అందుకున్న శ్రీ వాసవి అమ్మవారు.
నవంబర్7 ,క్రైమ్ 9 మీడియా త్రిలోకేష్ పులివెందుల రిపోర్టర్.
పులివెందుల లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నవంబర్ 7 నుండి 9వ తేదీన గౌరీ పూజ ఘనంగా జరుగుతుంది ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, అమ్మవారికి అభిషేకము,
గౌరీ అలంకరణ, సత్ప్రసంగాలు జరుగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా మండలి మరియు ఆర్యవైశ్య అధ్యక్షులు దేసు శ్రీనివాసులు వారి కుటుంబీకులు గౌరీ పూజలో పాల్గొన్నారు. "గౌరీ పూజ మహిళల ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక"అందరూ భక్తి పూర్వకంగా పాల్గొని ఆశీర్వాదం పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు . ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖులు మరియు భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరడమైనది.
9వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు గౌరీదేవి అమ్మవారికి వాసవి ఫంక్షన్ హాల్ నందు నిమజ్జనం అనంతరము వనభోజన కార్యక్రమం జరుగును.

