పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :07

పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తూ, వారి వ్యక్తిగత మరియు వృత్తి సంబంధిత సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు *‘పోలీసు వెల్ఫేర్ డే’* కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, “పోలీసు సిబ్బంది శ్రేయస్సు కోసం చేయాల్సిన ప్రతి చర్య మా బాధ్యత మాత్రమే కాకుండా, అది మా ప్రాధాన్యమన్నారు. సిబ్బంది సమస్యలను సమయోచితంగా పరిష్కరించడం కోసం నిరంతర చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

వెల్ఫేర్ డే సందర్భంగా ఎస్పీ గారు సిబ్బందిని వ్యక్తిగతంగా కలుసుకుని, వారు వ్యక్తపరిచిన వివిధ అంశాలను తెలుసుకున్నారు. సిబ్బంది నేరుగా చేసిన అభ్యర్థనలను సంబంధిత శాఖాధికారులకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారం తీసుకురావడానికి ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఎస్పీ "పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉంటూ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. ప్రతి సిబ్బంది తమ సమస్యలను సంకోచం లేకుండా తెలపాలని కోరుతున్నాను" అని అన్నారు.వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా సిబ్బందికి మరింత ధైర్యం, ప్రోత్సాహం అందించేలా ముందడుగు వేస్తామని ఆయన పేర్కొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post