పేరుకే ఉచితం అంతా అక్రమం.

పేరుకే ఉచితం అంతా అక్రమం.

ప్రభుత్వ అదికారులు కను సన్నల్లో ఇసుక రీచ్ లు.

 అన్ ఆర్థరైజ్డ్ గా ఇసుక వేలం పాటలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:29.

          ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ జేబులో నింపు కుంటున్న సంఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చోటు చేసు కుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు శనివారం అక్రమ ఇసుక ర్యాంపులను పరిశీలించిన అనంతరం అయిన మాట్లాడారు, దేవరాపల్లి మండలం లోని రాజకీయ నేతల అండ దండలతో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూటలా ఇసుకను జెసిబిలతో తీసిపగల పూట డాక్టర్ల ద్వారా దర్జాగా తరలించకు పోయి విక్రయిస్తూన్నారని తెలిపారు, మండలం లోని తేనుగుబూడి తామారబ్బ వెంకట రాజుపురం తిమిరా వేచలం బోయిల కింతాడ తో పాటు మరి కొన్ని గ్రామాలు శారదా నది పరివాహ ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ ఇక్కడ ఇసుక లభిస్తుందని తెలిపారు మొంథా తుపాను వల్ల రైవాడ గేట్లు తెరవడం తో శారదా నదిలో ఇసుక కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిందన్నారు ఇదే అదునుగా కొంత మంది అనాదేజుడుగా లక్షలాది రూపాయకు వేలం పాఠలు నిర్వహించి ప్రభుత్వానికి రావలసిన సొమ్మును ఇసుక అక్ర మార్కులు కాజేస్తున్నారని తెలిపారు,అయితే ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అడ్డం పెట్టు కొని అడ్డగోలుగా వ్యపారం సాగిస్తున్న,, పోలీసు రెవిన్యూ అధికారులకు తెలిసిన చూసి చూడ నట్లు వది లేస్తుండడంతో అక్రమార్కులు జంకు బొంకు లేకుండా దర్జాగా ర్యాంపులను వేసి మరి డాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి పోతున్నారని తెలిపారు కోన్ని ట్రాక్టర్లుకు కావలసిన కాగితాలు లేకపోయినా కనీసం డ్రైవర్లుకు.లైసెన్సులు లేక పోయిన విచ్చల విడిగా తోల కాలు చేపాడుతున్నాని ఇది అత్యంత ప్రమాదమని తెలిపారు అయితే ఇసుక రీచ్ లు స్థానిక రెవెన్యూ పోలీసులు కనుసన్నల్లో జరగడం విడ్డూరంగా ఉందన్నారు

దింతో ఇసుక వ్యపారులు ఎవరు వచ్చినా ఏమి చేయ లేరని తోల కాలు చేపాడు తున్నాని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాత్రం మేక పోతు గాం భీర్యం ప్రదర్శిస్తు పోలిసులకు రెవెన్యూ సచి వలయం ఉద్యోగులకు సైతం అదేశాలు ఇచ్చామని దీన్ని ప్రజలు కూడా బైటకు ఇసుక వెళ్ళకుండా చూడాలని బైటకు చేప్పిన మొత్తం వ్వవహరం ఎమ్మెల్యే చేతులు మీదుగా జరుగుందని తెలిపారు నిబంధ నలకు విరుద్ధంగా ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి వాగులు వంకలు నదీ ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పాటు,,, నదులపై బ్రిడ్జిలు కూలు పోతున్న పరిస్థితులు ప్రమాద భరితంగా ఉన్నప్పటికీ అధికారులు స్పందించక పోవడం అన్యాయ మన్నారు కొన్ని చోట్ల నదుల ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద చెట్లను సైతం తొలగించి జెసిబి తో రహదారులు ఏర్పాటు చేసి ఇసుకను రోజు పదుల కొద్ది ట్రాక్టర్ల ద్వారా తరలించకపోయి విక్రయి స్తున్నారని తెలిపారు.నదులు నుండి ఇసుక ఒడ్డుకు తీసుకు వచ్చి కుప్పలు కుప్పలుగా వేసి రాత్రి పూటలా లారిలతో సైతం విక్రయిస్తు న్నారని తెలిపారు ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ కు 2500 వరకు నది పరివాహక ప్రాంతంలో విక్రయిస్తున్నారని అది ఇతర ప్రాంతాలకు తరలించి మూడు వేల నుండి 4 వేల వరకు టాక్టర్ లోడ్ విక్రయిస్తు న్నారని అన్నారు

సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం చెబుతుంటే అదే సామాన్యుడు ఇసుకను కొనుక్కోలేని పరిస్థితి ప్రస్తుతం దేవరాపల్లి మండలం చుట్టు ప్రక్కల మండలంలో నెల కుందని తెలిపారు.పట్ట పగలు దేవరాపల్లి నాలుగు రోడ్లు మద్య నుండి బహిరంగగా ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించుకు పోతున్న పట్టించు కోక పోవడం చూస్తుంటే అధికారులు ప్రజా ప్రతి నిధులు అక్రమార్కులకు ఏ విధంగా సహకరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లెదంటే సోమవారం జిల్లా కలెక్టర్ వారికి పిజిఆర్ఎస్ లో పిర్యాదు చేసి విజిలెన్స్ అదికారులకు పత్యక ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరు తామని వెంకన్న స్పష్టం చేశారు.
 

Post a Comment

Previous Post Next Post