స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా. చేతులు శుభ్రత పాటించండి జిల్లా కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు,
ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవంతో జీవనం సాగించవచ్చు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దులూరు గ్రామ పంచాయతీ లో జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు. బి ఎన్ విజయకుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ, ప్రతి నెలా మూడవ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా ఈ రోజు సంతనూతలపాడు మండలం, ముద్దలూరు గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక శాసన సభ్యులు, అధికారులతో కలసి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్చత మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో శుభ్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఉంటే వారి కుటుంబం పరిశుభ్రంగా ఉంటుందని, తద్వారా సమాజమంతా పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు కలిగిస్తాయని, తడి, పొడి చెత్తలను వేరు చేసి డస్ట్ బిన్స్ లో వేయాలని తెలిపారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ విషయంలో సామూహికంగా కృషి చేయాలన్నారు. వీధులు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వాతావరణం, గాలి కూడా పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి, తినే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బి. ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మద్దులూరు గ్రామానికి రావడం జరిగిదన్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించడం చాలా ముఖ్యమన్నారు. అలాగే ఇంటితో పాటు పరిసరాలను ముఖ్యంగా సైడు కాలువలు, మురుగు కాలువలను ప్రతి రోజు శుభ్రంగా ఉంచుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. ప్రతి ఒక్కరు శుభ్రత పాటించినట్లయితే ఆరోగ్యకరమైన జీవనం సాగించకలుగతారన్నారు.
అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువ కప్పి సన్మానించడం జరిగింది.
తొలుత జిల్లా కలెక్టర్, శాసన సభ్యులతో కలసి మద్దులూరు ఎస్. సి కాలనీని సందర్శించి కాలనీ ప్రజలతో మాట్లాడి, వ్యక్తిగత పరిశుభ్రత, రోజు వారీ క్లాప్ మిత్రాలకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం గురించి, చెత్త నిర్వహణ, తాగు నీటి వినియోగం, మరుగుదొడ్ల వినియోగం వంటి అంశాలపై స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమ్యూనిటి హాల్, బస్షెల్టర్, స్కూల్ ప్రహరి గోడ అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి చేతుల శుభ్రతపై విద్యార్ధులకు అవగాహన కల్పించి, పిల్లలతో కలసి స్వయంగా చేతులు కడిగి పరిశీలించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి విజయ జ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, మెప్మా పిడి.శ్రీహరి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
