సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (JAC) ఆంధ్ర ప్రదేశ్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
నవంబర్ 24.ఏలూరు.
సమగ్ర శిక్షా ఉద్యోగులకు హెచ్.ఆర్. పాలసీ, ఎం.టి.ఎస్ అమలు వెంటనే చేయాలి.
ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ - జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ జీతాలతో, మరియు సరైన హెచ్. ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. హెచ్.ఆర్ పాలసీ అమలు, మినిమం అఫ్ టైం స్కిల్ అమలు చేసి జీతాల పెంపు మరియు సమయానికి చెల్లింపులు, ఎన్నేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంపు చేయడం, EPF, గ్రాడ్యుటీ-పెన్షన్ ప్రయోజనాలు అమలు, ఆరోగ్య బీమా మరియు మెడికల్ సదుపాయాలు కల్పించడం, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. అదే విధంగా CWSN విద్యార్ధులకు సంవత్సరం పొడవునా పిజియోథెరపీ అందించాలి, ఫిజియోథెరపిస్టులు- ఆయ సేవలను సమర్ధవంతంగా వినియోగించాలన్నారు. టీచర్స్ DSC మరియు ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నోటిఫికేషన్లలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు తగిన సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని కూడా జేఏసీ డిమాండ్ చేసింది. సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది. అనంతరం కలెక్టర్ గ్రీవెన్స్ సిటీ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. పై సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10 తేదీన 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జెఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అన్ని జిల్లాల సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

