సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకo - డీ.జె..ఎఫ్ వర్కింగ్ సభలో జాగృతి అధ్యక్షురాలు కవిత.
క్రైమ్ 9 మీడియా.. తెలంగాణ ప్రతినిధి బి. రవికుమార్..
నవంబర్ 9. "డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్" "ఓరుగల్లు సభ" హనుమకొండ పట్టణంలో లా కాలేజీలో నిర్వహించడం జరిగింది. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభకు ముఖ్య అతిథిగా జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై జర్నలిస్టు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని రకాల సహాయ సహకారాలు తన వంతుగా ఉంటాయని సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. డి. జి. ఎఫ్ వర్కింగ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ పది లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం అన్ని జిల్లాల సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని ప్రతి జర్నలిస్టు ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని అప్పుడే జర్నలిస్టుగా గుర్తుపు ఉంటుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ జిల్లా వ్యాప్తంగా సమస్యలపై ప్రతి స్పందిస్తామని రాబోయే జిల్లా వ్యాప్తంగా కమిటీల ఈ సభలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర జిల్లా నాయకత్వం రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలను పూర్తిచేయాలని తీర్మానం చేశామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి విన్నవిస్తామని అన్నారు.

