జాతీయ న్యాయ సేవా దినోత్సవం – ఏలూరులో ఘనంగా నిర్వహణ.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ప్రాంగణం,ఏలూరు.
జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని (National Legal Services Day) పురస్కరించుకుని ఈరోజు అనగా 09.11.2025 వ తేది నాడు ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా సాధికారిక భవనంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులు.
* వై. శ్రీనివాసరావు (జిల్లా సెవెంత్ అడిషనల్ జడ్జి).
* పి.ఎస్.వి.బి. కృష్ణ తేజ (అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్).
* కె. రత్నా ప్రసాద్ (డి.ఎల్.ఎస్.ఎ. సెక్రటరీ, సివిల్ జడ్జి).
* కోనేరు సీతారామ్ (న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు).
* బి. జె. రెడ్డి (జీ.పీ., ఏలూరు జిల్లా).
* ఎన్. సూర్యచంద్రరావు (ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ, అడ్మిన్)
👉ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్యచంద్రరావు జాతీయ న్యాయ సేవా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు:
👉సమాన న్యాయం (Equal Justice): భారత రాజ్యాంగంలోని 39 ఏ అధికరణం దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికీ న్యాయం అందకుండా పోకూడదని నిర్దేశిస్తుంది.
👉 ఈ లక్ష్యాన్ని సాధించడానికి 1995లో న్యాయ సేవల అధికరణ చట్టం (Legal Services Authorities Act) అమలులోకి వచ్చింది.
👉 ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన ఈ చట్టం ప్రారంభమైన రోజును పురస్కరించుకుని, జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా జరుపుకుంటారు అని న్యాయ మూర్తి లు తెలియ చేసినారు.
👉 ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలు మరియు అణగారిన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం (Free Legal Aid) గురించి అవగాహన కల్పించడం అని,చట్టాన్ని అమలు చేసే సంస్థగా, పోలీసులు న్యాయ వ్యవస్థకు మరియు సామాన్య ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు. ఎటువంటి ఆర్థిక స్థోమత లేని వ్యక్తికి కూడా న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా సాధికారిక సంస్థలు (DLSA) సిద్ధంగా ఉన్నాయనే భరోసాను ప్రజలకు ఇవ్వడం పోలీసుల బాధ్యత.*
👉 ప్రజలు తమ చట్టపరమైన హక్కులను, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలుసుకోవాలని, తద్వారా న్యాయం పొందడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా సమావేశమునకు హాజరైన అధికారులు తెలియ చేసినారు.
👉ఈ కార్యక్రమం న్యాయవ్యవస్థ, పోలీసులు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ కార్యక్రమమునకు ఏలూరు న్యాయవాదులు, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గారు మరియు ప్రజలు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


