బ్రాండెక్స్ కంపెనీలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ 27:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీసులు బ్రాండెక్స్ కంపెనీలో మహిళా ఉద్యోగుల కోసం మహిళా భద్రత, చట్టాలు, సైబర్ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ
ఈ.శ్రీనివాసులు , ఇన్స్పెక్టర్ నీలిమ , వన్ స్టాప్ సెంటర్ ఎస్సై రాములమ్మ పాల్గొని కీలక సూచనలు అందించారు.
కార్యక్రమంలో చర్చించిన ప్రధాన అంశాలు:
మహిళా చట్టాలు – మహిళా రక్షణకు సంబంధించిన నూతన క్రిమినల్ చట్టాలు, గృహహింస వంటి ముఖ్యమైన చట్టాలపై అవగాహన పోక్సో చట్టం – బాలికలపై నేరాలను నిరోధించడానికి ఉన్న నిబంధనలు, శిక్షలు శక్తి యాప్ వినియోగం – అత్యవసర సమయంలో పోలీసులు వెంటనే సహాయం అందించే విధానం
సైబర్ క్రైమ్ – ఆన్‌లైన్ మోసాలు, హరాస్‌మెంట్, సోషల్ మీడియాలు పాటించాల్సిన జాగ్రత్తలు.
రోడ్డు భద్రత – ఉద్యోగులకు, మహిళా కార్మికులకు అవసరమైన ట్రాఫిక్ నియమాలు,మాదక ద్రవ్యాల ముప్పు – డ్రగ్స్ వాడకం వలన కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలు; యువత & ఉద్యోగులు దూరంగా ఉండాల్సిన అవసరం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు పోలీసు శాఖ చేపడుతున్న మహిళా భద్రతా చర్యలను అభినందిస్తూ, తమ హక్కులు మరియు రక్షణ నిబంధనలపై విలువైన అవగాహన పొందారు.
