పేదలకు ఉచిత గృహాల తాళాలు అందజేశన ఎమ్మెల్యే బండారు.


 పేదలకు ఉచిత గృహాల తాళాలు అందజేశన ఎమ్మెల్యే బండారు.

 క్రైమ్ 9మీడియా ప్రతినిధిజిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు. అనకాపల్లి నవంబర్:12

మాడుగుల మండలం పోతనపూడి అగ్రహారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రారంభిస్తున్న పేదలందరికీ ఇల్లు సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇల్లు తాళాలను అప్పజెప్పి గృహప్రవేశం కార్యక్రమంలో మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది. అనంతరం అదే గ్రామంలో ప్రకృతి వ్యవసాయ స్టోర్ ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post