మోంథా నష్టాల పరిశీలనకు ఈనెల 10వ తేదీన జిల్లాలో కేంద్ర బృందం పర్యటన- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.


మోంథా నష్టాల పరిశీలనకు ఈనెల 10వ తేదీన జిల్లాలో కేంద్ర బృందం పర్యటన- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

              ఏలూరు , నవంబరు, 9: ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఈనెల 10వ తేదీన జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 10 వ తేదీ మధ్యాహ్నం 2. 30 ని.లకు గన్నవరం నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఏలూరు జిల్లా ఉంగుటూరు చేరుకుంటారన్నారు. ఉంగుటూరులో తుఫాన్ నష్టాలు, అనంతరం జిల్లా యంత్రాంగం చేపట్టిన పునరుద్ధరణ పనులపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని, అనంతరం ఉంగుటూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మోంథా తుఫాన్ నష్టాలను అధికారులతో కలిసి పరిశీలిస్తారన్నారు. అనంతరం సాయంత్రం 4. 30 ని.లకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం బయలుదేరి వెళతారని కలెక్టర్ తెలియజేసారు. 

          కేంద్ర పరిశీలన బృందంలో కేంద్ర వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. కె. పొనుసామి, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శ్రీనివాసు బాల్రి, కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా లు సభ్యులుగా ఉన్నారు. 

Post a Comment

Previous Post Next Post