డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడ!( డివైఎఫ్ఐ).


 డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడ!( డివైఎఫ్ఐ).

 నెల్లూరు జిల్లా ప్రజానాయకుడు పెంచలయ్య మృతికి ఘన నివాళి.

జంగారెడ్డిగూడెం క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

 నవంబర్ 30 జంగారెడ్డిగూడెం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చంచలయ్య మృతికి మీసేవ సెంటర్ నందు కొవ్వొత్తుల నిరసనతో నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ అధ్యక్షత వహించగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు పి, సూర్యరావు మాట్లాడుతూ మంచి కోసం పోరాడే వాళ్ళు అంటే కొంత మందికి భయం వారు చేసే వ్యాపారం దెబ్బతింటుంది అనో,లేక ప్రజల కు కట్టుకధలు చెప్పి తెచ్చుకున్న అధికారం ఉడుతుంది అనో , అడవిలో ఉన్నా,ప్రజల మధ్య ఉన్న చంపడం ,ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం కొంత మంది నైజం.. మాకు మృత్యువు కొత్త కాదు,అమరత్వం కొత్త కాదు,భగత్ సింగ్ నడిపిన బాట లో మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాము..సమ సమాజం కోసం అసువులు బాసిన నెల్లూరు dyfi నాయకుల అమరులు చెంచయ్య, చలపతి,మన్సూర్ ఖాన్, వారసుడి గా డివైఎఫ్ఐ ఉద్యమ నాయకుడిగా ప్రజానాట్యమండలి కళాకారుడుగా డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదాన్ని అందుకొని నువ్వు చేసిన పోరాటం మాకు ఆదర్శం.అమరుడా పెంచాలయ్య నీకు జోహార్లు... నీ మరణం వృధా కాదు,నీవు ఎత్తిన జెండా మరింత గట్టిగా పట్టుకొని నినదిస్తాము, నిలబడతాము, మాదకద్రవ్యాలకు వ్యతిరేఖంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నీ ఆశయాన్ని కొనసాగిస్తోంది. సిఐటియు నాయకులు నాగేంద్ర, బి నాని,సునీల్, కె నాని, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post