యువగలం పాదయాత్రలోనారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ డిమాండ్.


యువగలం పాదయాత్రలోనారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ డిమాండ్.
 మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగేది లేదు.

 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.

 ఏలూరు లో ఉన్న ప్రభుత్వ  కోటదిబ్బ డిగ్రీ కళాశాలకు శాశ్వతమైన భవనాలు నిర్మించాలి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

     నవంబర్ఏ 30.ఏలూరు లో ఉన్న స్ఫూర్తి భవన్ కార్యాలయంలో  అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ మాట్లాడుతూ  విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్ విద్యార్థుల దగ్గరికి యువగలం పాదయాత్ర ద్వారా  వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ కల్పిస్తామన్నారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ కల్పిస్తామన్నారు, మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తామన్నారు, ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి యూనివర్సిటీలను పరిరక్షిస్తాం, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తాం, రాష్ట్రంలోని ప్రత్యేక యూనివర్సిటీలను నిధులు తెస్తాం, మెడికల్ విద్య లోని 107, 108, జీవోలను రద్దుచేసి మెడికల్ విద్యను ప్రభుత్వ పరంగా నడిపిస్తామని చెప్పి    ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యలో 15000, 15000 అని ప్రచారం చేసుకొని  అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ విద్యార్థులకు రాజకీయాల అవసరమా అంటూ, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 (ఏ) ప్రాథమిక హక్కులను, భావా ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు, కాబట్టే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్  Aisf విద్యార్థి హక్కులను కాపాడు  విద్యార్థి తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్న  ఫీజు రియంబర్స్మెంట్   6400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, డిమాండ్ చేశారు, అదే విధంగా మెడికల్ విద్యను కాపాడాలి,  పి పి పి  విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమం తప్పదని  స్పష్టం చేశారు, కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుంది  అని భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. స్థానిక ఏలూరులో ఉన్న ప్రభుత్వ  కోట దిబ్బ డిగ్రీ కళాశాలకు శాశ్వతమైన భవనాలు నిర్మించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు నాయకులు  బి. దీపక్, పి. నాగ సాయి, వి. వెంకట్, పి. జయ వీర, టి.  సాత్విక్ , ఎన్.మణితేజ, ఎండి. తాజ్, ఈ. రాకేష్, బి. ప్రదీప్, ఏ. జితిన్ , డి .రచిత్,  తదితరులుపాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post