స్త్రీ, నిధి. పత్రికను ఆవిష్కరణ.


 స్త్రీ, నిధి. పత్రికను ఆవిష్కరణ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ప్రకాశం జిల్లా కలెక్టర్.రాజాబాబు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “స్త్రీ నిధి” పోస్టర్ ను ఆవిష్కరించారు. 

       స్త్రీ నిధి కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సబలీకరణకు ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలు ప్రజలకు చేరేలా ఈ పోస్టర్ రూపకల్పన చేయబడింది. మహిళల స్వయం సహాయక సంఘాల ఎస్ హెచ్ జి లు అభివృద్ధి, స్వావలంబన, మరియు సామాజిక పురోగతిని లక్ష్యంగా ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్. పి రాజబాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్త్రీ నిధి ద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా వారి కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది” అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ (డి ఆర్ డి ఏ) టి.నారాయణ , ఏ.ఉమామహేశ్వరరావు డీజీమ్ స్త్రీ నిధి, ఎం.ఉదయ్ కుమార్. ఏ. జి ఎం. డీ పీ ఎంలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు .

Post a Comment

Previous Post Next Post