బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తనయడు.
పెద్దపల్లి మండలం బంధంపల్లి శివారులో ఇంటర్ సెకండియర్ విద్యార్థి విశ్వతేజ బావిలో దూకి ఆత్మహత్య.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల కుమారుడు. ఇంటర్ సెకండియర్ చదివే విశ్వతేజ తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు చదువుపై ఆసక్తి లేకపోవడమేనని భావిస్తున్నారు. డేస్కాలర్స్ అయిన విశ్వతేజను హాస్టల్లో వేస్తామని పేరెంట్స్ చెప్పడంతో మానసిక ఆందోళనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కుమారుడు మృతితో పెద్దపల్లిలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని బావి నుండి బయటికి తీసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు.
