ప్రభుత్వం నిర్ధారించిన సమయానికి జన గణ పూర్తి చెయ్యాలి!
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జనగణన 2027 ప్రీ-టెస్ట్‌ను పక్కాగా నిర్వహించాలి — రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె. నివాస్.
జనగణన–2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డులు (13, 14, 15, 16, 17, 18, 20) లో నవంబర్ 10 నుండి 30 వరకు ప్రీ-టెస్ట్ మొదటి దశను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్.జె. నివాస్, ఐఏఎస్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లతో మాట్లాడుతూ, సర్వేలో ప్రతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ల స్థితి, కుటుంబ యజమాని వివరాలు, అలాగే త్రాగునీరు, మురుగునీటి పారుదల, మరుగుదొడ్లు, వంటగది లభ్యత, రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కార్ వంటి సౌకర్యాలపై మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరించబడతాయని తెలిపారు. సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన సూచించారు.
వార్డు నం. 18 మరియు 20ల్లో ఎన్యూమరేటర్లు యాప్ ద్వారా భవనాల జియో-ట్యాగింగ్ విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన సూచనలు అందించారు.
అనంతరం, ప్రీ-టెస్ట్ ప్రాముఖ్యత మరియు జనగణన డేటా విలువపై ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్. ఆర్. గోపాలకృష్ణ, ఐఏఎస్ మాట్లాడుతూ, జనగణనను ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని, అన్ని వివరాలను మొబైల్ యాప్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు.
ఈకార్యక్రమంలోకనిగిరిఆర్డీఓ.కేశవర్ధన్ రెడ్డి, జనాభా గణన అసిస్టెంట్ డైరెక్టర్.ఎం. శ్రీనివాసరావు, పొదిలి కమిషనర్ మరియు ఛార్జ్ అధికారి కె.ఎల్.ఎన్. రెడ్డి, తహసీల్దార్.కృష్ణారెడ్డి, జనాభా గణన అధికారులు, అలాగే రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
