పోలీసు కుటుంబాల సంక్షేమం – అనకాపల్లి జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాల సమీక్ష, చెక్కుల పంపిణీ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు. అనకాపల్లి, నవంబర్ 23: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఉమ్మడి అనకాపల్లి–అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అందాల్సిన సర్వ రకాల ప్రభుత్వ/పోలీస్ విభాగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు వేగంగా చేరేలా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.
విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్రాట్యుటీ, APGLI, PF, GIS, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, డెత్ బెనిఫిట్స్, PSP సాలరీస్ లో భాగంగా గవర్నమెంట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వంటి అన్ని ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే డిసీజ్డ్ ఫ్యామిలీస్ మరియు రిటైరడ్ ఎంప్లాయీస్ ఫైళ్లలో ఏవి పూర్తయ్యాయి,ఏవి పెండింగ్‌లో ఉన్నాయోవివరాలను సేకరించి, పెండింగ్ కేసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరేలా చూడాలని ఎస్పీ స్పష్టం చేశారు.
సిబ్బంది పిల్లల చదువు, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు భద్రతపై సమగ్ర సమీక్ష.
విధి నిర్వహణలో గాయపడిన లేదా ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబాలకు సంబంధించిన పిల్లల విద్య,ఉద్యోగ అవకాశాలు,అందాల్సిన బెనిఫిట్స్,వంటి అంశాలపై పూర్తి వివరాలు సేకరించి తక్షణ సూచనలు ఇచ్చారు.
ఈ సమావేశం అనంతరం, అనకాపల్లి జిల్లా పోలీస్ Adhoc Committee ఆధ్వర్యంలో విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలక 50,000/- విలువైన చెక్కులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ: “పోలీసు శాఖ కోసం తమ జీవితాలను అర్పించిన సిబ్బందికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. వారి కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత. ఈ సహాయం భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతుంది.”
ఆర్థిక సహాయం అందుకున్న 6 కుటుంబాలు ఒక్కొక్కరికి ₹50,000/- చొప్పున పొందిన హెచ్.సీ కె.దీనబంధు భార్య ఆర్.రాధా,పీసీ సిహెచ్.విజయ రామసింగ్ భార్య ఆర్.సుధారాణి, హెచ్.సీ వి.అప్పలరాజు,భార్య వి.లక్ష్మీకాంతం,హెచ్.సీ సిహెచ్.సాంబమూర్తి, భార్య సిహెచ్.గడ్డమ్మ, ఏఆర్ఎస్ఐ పి.రమణ భార్య పి.వి.కుమారి, ఏ.ఆర్ హెచ్.సీ వి.ఈశ్వరరావు భార్య వి.పద్మ లకు నగదు చెక్కులను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.
సమావేశం మరియు కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, ఏవో సి.హెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు ఎస్.అప్పలనాయుడు, బి.రామకృష్ణారావు, పోలీస్ అడహక్ కమిటీ సభ్యులు, ఆఫీస్ సూపర్డెంట్లు ప్రతాప శేషయ్య, దేవరాజు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
