బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి నవంబర్: 16.అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట
పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలలో భాగంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ ఆదివారం బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై ఏ.శ్రీనివాసరావు డీఐజీ కి సాదర స్వాగతం పలికారు.
డీఐజీ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, దర్యాప్తు విధానాలు, పెండింగ్ కేసుల ప్రగతిని ఖచ్చితంగా పరిశీలించి, అవసరమైన సూచనలు అందించారు.
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు, తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
మత్తు పదార్థాలు వాడే వారిని గుర్తించి కౌన్సిలింగ్, రెహాబిలిటేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సైబర్ నేరాల నివారణ కోసం గ్రామ స్థాయిలోనే ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, బ్యాంకు ఖాతాలు, OTPలు, వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ప్రజల్లో నాటాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల తగ్గింపు లక్ష్యంగా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్–సీట్‌బెల్ట్ వాడకం పై నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
స్టేషన్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన డిస్పోజ్ చేయాలని తెలిపారు.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, మహిళా చట్టాలపై అవగాహన, హెల్ప్‌లైన్‌ల వినియోగంపై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు.
నేరాల నిరోధకతలో కీలకమైన సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి, వాటి ఏర్పాటు కోసం గ్రామస్థులతో సమన్వయం చేయాలని ఆదేశించారు.
తరువాత సిబ్బందితో సమావేశమై, నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ ధోరణితో విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ తనిఖీలో ఎస్సైలు ఏ.శ్రీనివాసరావు, రఘువర్మ, నారాయణరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

