భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన రోజు నవంబర్ 26వ తేదీ అని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్బి.శివారెడ్డి అన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైన రోజుఅన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్న రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు .
అందుకనే ఆ పవిత్రమైన రోజును భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపు కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అన్నారు. 1950 జనవరి 26 వ తేదీ రిపబ్లిక్ డే గా ప్రకటించి ఆ రోజు నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు .ఆరోజు నుండి భారత దేశ పౌరులందరూ న్యాయం, స్వేచ్ఛ,సమానత్వం, రిజర్వేషన్లు పొందుతున్నారని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు.రాజ్యాంగ పితామహుడు,సామాజిక సంస్కర్త, రాజకీయవేత్త, న్యాయవాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 60 దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు .
ఈ రాజ్యాంగం రూపొందించిన విధివిధానాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటాయని. ఈ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, అధికారులు రాజ్యాంగంలో రూపొందించిన విధి విధానాల ద్వారా బాధ్యతలు నిర్వర్తిస్తార రనీ ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. భారతదేశ ప్రజలు జీవన విధానాలను గుర్తించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారని ఆయన ఆశలు,ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ముందుకు తీసుకు వెళ్తూ భారతదేశ అభివృద్ధికి కంకణ బద్ధులు కావాలని
ఎస్ ఎం ఆర్ పెదబాబు పిలుపునిచ్చారు.తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమాన్ని రెవిన్యూ ఆఫీసర్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎం ఇ సురేంద్రబాబు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్,దేవరకొండ శ్రీనివాసరావు, డిఈలు అప్పలరాజు, నారాయణరావు,రజాక్,ఏఈలు, పి ఓ, మెప్మా సీఎం,కార్పొరేషన్ లోని అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


