మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా.స్వామి పనితీరును ప్రశంసించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.



 మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా.స్వామి పనితీరును ప్రశంసించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి, ఉండవల్లి.

మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి శనివారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 

మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని ముఖ్యమంత్రి అభినందించి ప్రశంస పత్రం, ఉత్తమ సేవా అవార్డుతో సత్కరించారు. ప్రకాశం జిల్లా మరియు విశాఖ జిల్లాలోనూ ఇన్చార్జి మంత్రిగా డా. స్వామి తుఫాను సహాయక చర్యలపై అధికారులను సమన్వయం చేసి ప్రజలకు అండగా నిలిచినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆర్.టి.జి.ఎస్ ద్వారా తుఫాన్ పై నిరంతరం సమీక్షిస్తూ అధికారుల్ని, కూటమి క్యాడర్ ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.ప్రభుత్వ ముందస్తు అప్రమత్తత వల్ల ప్రాణ, పశు నష్టం నివారించగలిగాం. తుఫాన్ సమయంలో కలెక్టర్ నుంచి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వరకు అంతా కష్టపడి పని చేశారని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post