తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న పంట అంచనాలు తయారు చేయాలని. కలెక్టర్ ఆదేశం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా/కంభం,
మొంథా తుఫాన్ వలన నష్ట పోయిన పంట వివరాలను అంచనా వేయడంతో పాటు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
శనివారం కంభంలోని వెలుగొండ ప్రాజెక్టు అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి తో కలసి గిద్దలూరు నియోజక వర్గంలో తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న పంట అంచనాలు తయారు చేయడం పై, దెబ్బ తిన్న రోడ్ల పునరుద్ధరణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొంథా తుఫాన్ వలన నష్ట పోయిన పంటను ఎన్యూమరేట్ చేయడంలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలన్నారు.
అలాగే నియోజక వర్గం పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలను పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదించాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న ఇరిగేషన్ కెనాల్స్, చెరువులకు సంబంధించి నష్టం అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి కి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గిద్దలూరు.శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వారి సారధ్యంలో సహాయక చర్యలు చేపట్టడంలో అన్నీ శాఖల అధికారులు, వారి సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు నియోజక వర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ శ్రీ శివ రామిరెడ్డి, ఇరిగేషన్, ప్రాజెక్ట్స్ ఎస్ఈ లు శ్రీమతి వరలక్ష్మి, అబూత్ఆలి, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్.అండ్.బి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ లు శ్రీ బాల శంకర రావు, రవి నాయక్, అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డీపీఓ.వెంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

