మార్కాపురం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ని దోర్నాల,లో
మొంథా తుఫాన్ కారణంగా పంట నష్ట పోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు తెలిపారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్.పి రాజాబాబు, దోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించి దెబ్బతిన్న రోడ్లను, పంటలను పరిశీలించారు.
తొలుత జిల్లా కలెక్టర్ దోర్నాల మండలం, గంటవానిపల్లె సమీపంలో తీగలేరు వాగు పై దెబ్బతిన్న బ్రిడ్జి పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
ఈ బ్రిడ్జి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి రాకపోకలకు అనువుగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
అనంతరం కటికానిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పోవడానికి వీలులేని దెబ్బతిన్న పంట పొలాలను డ్రోన్ సహాయం పరిశీలించారు. వరదల కారణంగా పంట పొలాల్లో వచ్చిన రాళ్ల, ఇసుక మేట ను సత్వరం తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రైతులతో కూడా మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, గత వారం రోజులుగా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడం జరిగిందన్నారు. దీని కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా వరకు పంట దెబ్బతినడం జరిగిందన్నారు. వెలుగొండి ప్రాజెక్టు ఫీడర్ కెనాల్స్ కారణంగా దోర్నాల మండలం లోని చాలా గ్రామాల్లోని పంట పొలాల్లోకి రాళ్ళు, ఇసుక మేట వేసి పంటల దెబ్బతినడం జరిగిందన్నారు. ఈ రోజు దెబ్బతిన్న రోడ్ల ను, పంటపొలాలను పరిశీలించడం జరిగిందని, సత్వరమే రాళ్ళు, ఇసుక మేట తొలగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు పంట నష్టం జరిగిందో పూర్తి స్థాయిలో అంచనా వేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.
కలెక్టర్ వెంట మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ శ్రీ శివ రామిరెడ్డి, ఇరిగేషన్, ప్రాజెక్ట్స్ ఎస్ఈ లు శ్రీమతి వరలక్ష్మి శ్రీ అబూత్ఆలి, వ్యవసాయ శాఖ జేడి శ్రీ శ్రీనివాస రావు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి. గూడూరి ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


