ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అగ్ని ప్రమాదం..కార్ డ్రైవర్ సజీవ దహనం.


 ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అగ్ని ప్రమాదం..కార్ డ్రైవర్ సజీవ దహనం.

క్రైమ్ 9 మీడియా.నవంబర్ 25. తెలంగాణ ప్రతినిధి.

           మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకొని దారుణ అగ్నిప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం శామీర్పేట నుంచి కీసరకు వెళ్తుండగా లియోనియా రెస్టారెంట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న కార్లో ఏ.సీ ఆన్ చేసుకుని నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగి అందులో ఉన్న కారు డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన నెలకొంది.

 మంటలు కారు మొత్తం వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ నిద్రలో ఉండడం వల్ల డ్రైవర్ చనిపోయినట్టు పోలీసుల సమాచారం. అగ్ని ప్రమాద సంఘటన అందుకున్న పోలీసులు ,ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద కారణం కోణంలో కేసుగా దానిపై విచారణ కొనసాగిస్తున్నారు

Post a Comment

Previous Post Next Post