కవి కనకదాసు కు పుష్పాంజలి ఘటించిన డి ఆర్ వో.



 కవి కనకదాసు కు పుష్పాంజలి ఘటించిన డి ఆర్ వో. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

        ఒంగోలు ఆధునిక కవి, తత్వవేత్త కనకదాసు తన కీర్తనలతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందింపజేశారని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డీఆర్ఓతో పాటు బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆయా శాఖల సిబ్బంది, పలు సంఘాల నాయకులు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా డీఆర్ఓ మాట్లాడుతూ, కనకదాను భక్తులకు నేడు పండుగ రోజన్నారు. కర్నాటకలో జన్మించిన కనకదాసు కన్నడ భాషలో రచించిన కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. మన రాష్ట్రంలోని కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోనూ కనకదాసు చిత్రపటం ఉంటుందని, అక్కడి ప్రజలు ఆయనను ఎంతో భక్తితో పూజిస్తారని ఆయన తెలిపారు. నిర్మల జ్యోతి, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనకదాసు రచనలను కొనియాడారు. బీసీ సంఘాల నాయకులు లంబు నాగేశ్వరరావు, రాచూరి శ్రీనివాసరావు, లంబు రాజేంద్ర, బక్కా సాంబశివరావు, బోలె శ్రీనివాసరావు, బోలె నాగేశ్వరరావు, తదితరులు మాట్లాడారు.

Post a Comment

Previous Post Next Post