ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి- డోలా.



 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి- డోలా. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా టంగుటూరు. మండలం లో ఆయన కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా సహాయనిధి చెక్కుల పంపిణీ. మంత్రి మాట్లాడుతూ.

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 

శనివారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు రూ.53.71 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు కొండపి నియోజకవర్గ పరిధిలో 77 మందికి 53 లక్షల 71 వేల రూపాయలు చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1002 మంది లబ్దిదారులకు 8 కోట్ల 59 లక్షల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఒక్క కొండపి నియోజక వర్గానికే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారంటే ముఖ్యమంత్రి కి పేద ప్రజల పట్ల ఉన్న చిత్త శుద్ధి, అంకిత భావంకు నిదర్శమన్నారు.

ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రతి నెలా 1వ తేదీన పేద ప్రజలకు పింఛన్లు అందచేయడం జరుగుచున్నదన్నారు. దీపం పథకం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ సుమారు 2700 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

తల్లి కి వందనం పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సహాయంను అందచేయడం జరుగుచున్నదన్నారు. మత్స్యకార సేవలో ద్వారా సంవత్సరానికి 20 వేల రూపాయలు వంతున, అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ద్వారా సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. డోల బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post