సమాచార హక్కు చట్టం 2005 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు అవగాహనా ర్యాలీ.
క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ చక్రవర్తి.
ఏలూరు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు పౌర సమాచార అధికారి నేతల విజయ చంద్ర, అప్పిలేట్ అధికారి కె. ఫణి భూషణరావు, వి.బి.వి.ఆర్. సుధాకర్, ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ మరియు పబ్లిక్ హెల్త్ డివిజన్, సబ్ డివిజన్ ఏలూరు ఉద్యోగులు " తెలుసుకోవడం మీ హక్కు తెలియచేయడం ప్రభుత్వ బాధ్యత " అనే నినాదంతో పబ్లిక్ హెల్త్ డివిజన్ కార్యాలయం నుండి ఉద్యోగులు బయలుదేరి గులాబీ తోట మీదగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.


