ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కేంద్ర ప్రభుత్వ పంజాబ్, అమృత్సర్ నుండి నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) 5వ వార్షికోత్సవాన్ని వేడుకలలో జిల్లా యంత్రాంగం వారు వర్చువల్ గా కార్యక్రమం దామరచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించడం జరిగినది .
ఈ కార్యక్రమం లో పోలీస్ శాఖ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో విద్యార్ధులు మరియు యువతతో మాదక ద్రవ్యాలు కు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు, ఈగిల్ టీమ్ అధికారులు , రిటైర్డ్ ఎస్. పి. బాల్లి రవి చంద్ర గారు, కాళాశాల ప్రిన్సిపాల్ యన్. శ్రీనివాస రావు, అధ్యాపక బృందం, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మరియు విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు ప్రేరేపించే అంశాలతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. నిపుణులైన రిసోర్స్ పర్సన్ తో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించబడింది. విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,200 మంది విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు ప్రతిజ్ఞ చేశారు.
