శిశు మరణాలపై సమీక్ష సమావేశం ఆరోగ్యశాఖ అధికారి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో శిశు మరణముల పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు,ఆధ్వర్యంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమల సమక్షంలో శిశు మరణములపై సమీక్షా సమావేశం నిర్వహించినారు సర్వజన ఆసుపత్రి ఒంగోలు నందు నిర్వహించినారు ఈ సందర్భంగా జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి మాట్లాడుతూ 0- 5 సంవత్సరముల పిల్లలందరికీ విధిగా అన్ని వ్యాధులు తప్పనిసరిగా ఇవ్వవలసిందిగా ఆదేశించినారు పుట్టుకతో లోపాలు గల పిల్లలను గుర్తించి వారిని సమీపంలోని డైస్ సెంటర్ నందు తగు చికిత్స చేయించవలసిందిగా ఆదేశించినారు,
అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం వారు సరఫరా చేయు సమతుల ఆహారమును ప్రతి బిడ్డకు సకాలంలో అందే విధంగా చూడాలనిఅన్నారు,
ఏమైనా ను సమస్యలు ఉన్నచో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో గాని లేదా సర్వజన ఆస్పత్రిలో గాని సకాలంలో చూపించి సరైన వైద్యము అందించవలసిందిగా ఆదేశించినారు
ఎ యన్ యమ్ లు శిశువుల టీకాలు వివరములు ఎం సి పి కార్డు నందు నమోదు చేసి ఆర్ సి హెచ్ పోర్టల్ నందు నమోదు చేయల్లాన్నారు,
ఈ కార్యక్రమంలో సర్వజన చిన్న పిల్లల విభాగం వైద్య అధికారులు డాక్టర్ రవితేజ,డాక్టర్ పద్మావతి,డాక్టర్ చంద్రశేఖర్, పాల్గొని ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో శిశు మరణములను సంభవించు కూడా చూడాలని సమస్యకు హాజరైన వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,
