తణుకు పట్టణంలో హద్దులు మీరుతున్న ఆకతాయిలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.తణుకు, ప. గో. జిల్లా.
తణుకు పట్టణంలో హద్దులు మీరుతున్న ఆకతాయిలు. రద్దీగా ఉండే సమయంలో నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు.
నిన్న మొన్నటి వరకు జాతీయ రహదారిపై ఇలాంటి పుట్టినరోజులు చేసుకుంటూ వాహనదారులను ఇబ్బందులు పెడుతూ ఉండేవారు.
ఇప్పుడు ఈ సంస్కృతి సాక్షాత్తు తణుకు పట్టణంలో రద్దీగా ఉండే వెంకటేశ్వర థియేటర్ సెంటర్ ప్రాంతంలో నడిరోడ్డు పైకి చేరింది.
శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద పుట్టినరోజు వేడుకలు పేరుతో ఆకతాయిలు బాణసంచా కాల్చడంతో వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బాణాసంచా పలువురు వాహదారులు, పాదచారులపైకి దూసుకు రావడంతో స్వల్పంగా గాయపడ్డారు.
పోలీసులు చూస్తూ ఊరుకుంటే ఇలాంటి సంస్కృతి మరింత పెచ్చు మీరుతోందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు.
Add

