ఫిర్జాదిగూడ ప్రభుత్వ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ..." తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్" సభ్యురాలు-గోగుల సరిత.
క్రైమ్ 9 మీడియా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా.. నవంబర్ 16. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీర్జాదిగూడ హై స్కూల్ ను తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరిత పర్యవేక్షించారు. స్కూల్లోని మౌలిక సదుపాయాలు తరగతి గదుల శుభ్రత, స్కూలు నిర్వహణ, తాగునీటి సదుపాయం వంటి అంశాలపై సమీక్షించారు .విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెనూ అమలు, వంటశాల పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించి విచారణ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థులు తో నేరుగా మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల సమస్యల పట్ల పరిష్కారానికి అవసరమైన సూచనలు అందించారు. స్కూలు అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం విద్యార్థులకు ఆరోగ్యకమైన వాతావరణ కల్పించడం పాటు విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కమిషన్ సభ్యురాలు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ స్కూలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

