తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం ముత్తుముల్ల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తు ముల అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలగమని గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
బేస్తవారిపేట మండలం టౌన్ నందు బేస్తవారిపేట మండల టిడిపి అధ్యక్షుడు సోరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెదేపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అశోక్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉండాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన పార్టీ కార్యాలయం గడప తొక్కేలాగా సేవలు అందించాలన్నారు m. తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా నిలుస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తరంగా తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట మండల అధ్యక్షుడు సో రెడ్డి మోహన్ రెడ్డి, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి గుంతిక నరసింహ యాదవ్ గారు, బెస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు సైదులు, బేస్తవారిపేట కస్టర్ ఇంచార్జి ముప్పురి రాము, బేస్తవారిపేట మండల అధ్యక్షురాలు సున్నం అనిత గారు, మరియు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, తదితులు పాల్గొన్నారు,

