ముంపు గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.



 ముంపు గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు,మొంథా తుపాను కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షం నీటిని త్వరగా క్లియర్ చేసేలా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ తో కలసి కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలంలో పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కొత్తపట్నం రోడ్డు లోని టిడ్కో ఇళ్ళ సమీపంలో మొంథా తుపాను కారణంగా ముంపుకు గురై ప్రాంతాన్ని పరిశీలించారు. 

 అనంతరం అల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద, అల్లూరు – ఆలూరు రోడ్డు లో నిర్మాణంలో వున్నా బ్రిడ్జి నిర్మాణాన్ని, అల్లూరు లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద, బహింగ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగితెలుసుకున్నారు.

  ముంపు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షం నీటిని బయటకు పంపేలా అవసరమైన చర్యలను యుద్దప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, నాగులుప్పలపాడు మండలం, చదలవాడ ఎస్.టి కాలనీని సందర్శించి ముంపుకు గురైన రోడ్లను పరిశీలించారు. 

 ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడుతూ, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ, పునరావాస కేంద్రంలో భోజన వసతులు ఎలా వున్నాయి, త్రాగునీరు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  

గుండ్లకమ్మ వాగు నుండి నీటిని విదుల చేయడంతో ఈ కాలనీ మొత్తం ముంపుకు గురైందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లు ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాలనీ వాసులకు తెలపడం జరిగింది.  

ఈ కాలనీ లో వైద్య బృందాలను పంపి వైద్య అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా వైద్యాదికారులను ఆదేశించారు. 

అనంతరం చదలవాడ లోని రామన్న చెరువును పరిశీలించారు. 

జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డిఓ శ్రీమతి లక్ష్మి ప్రసన్న, కొత్త పట్నం మండల ప్రత్యేక అధికారి, డి ఆర్ డి ఏ పిడి శ్రీ నారాయణ, నాగులుపాడు మండల ప్రత్యేక అధికారి, డ్వామా పిడి.జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి. శ్రీనివాస రావు, సంబంధిత మండల అధికారులు, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులుతదితరులు పాల్గొన్నారు.

Add




Post a Comment

Previous Post Next Post