మేజిక్ డ్రైనేజీతో మురుగు నీరు నిర్వహణ. ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాధ్.


 మేజిక్ డ్రైనేజీతో మురుగు నీరు నిర్వహణ. ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాధ్.

రంపచోడవరం : మురుగు నీరు నిర్వహణ లో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నది దానిలో భాగంగా గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా గృహాల సముదాయంలో మేజిక్ డ్రైనేజీలు ఏర్పాటు చేయనున్నామని రంపచోడవరం డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ అన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు రంపచోడవరం మండలానికి పైలట్ ప్రాజెక్ట్ గా రూ ఒక లక్ష 50 వేల నిధులతో మేజిక్ డ్రైనేజీ మంజురు కాగా వాటికి సంబందించిన నిర్మాణ పనులు ఐ.పోలవరం గ్రామ పంచాయితీ ఇర్లపల్లి గ్రామంలో రంపచోడవరం మండలం ఉపాధి హామీ సిబ్బంది చేపట్టారన్నారు. దానిలో భాగంగా గురువారం ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాధ్ నిర్మాణం జరుగుతున్న మేజిక్ డ్రైనేజీ ప్రాంతాన్ని సందర్శించి సాంకేతిక సిబ్బందికి పలు సూచనలు చేసారు. సందర్బంగా శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడితు నాణ్యతలో రాజీ పడకుండా కొలతలు మేరకు నిబంధనలను దృష్టిలో ఉంచుకొని మేజిక్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ ప్రోగ్రాం అధికారి సత్యనారాయణ, జూనియర్ ఇంజినీర్ ఏడ్విన్ బాబు సాంకేతిక సహాయకులు సూర్రెడ్డి, శేఖర్, వాకా వీరన్న, క్షేత్ర సహాయకుడు వీరామణి తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post