తుఫాను వలన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన. మంత్రి డా,, డోలా.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా పంట దెబ్బతిని నష్ట పోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా,,డోలా.బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
శుక్రవారం ఉదయం కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండల పరిధిలోని అంకేపల్లి, రాజుపాలెం గ్రామాల్లో మొంథా తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న సజ్జ పంటను పరిశీలించి, అధికారులు, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మొంథా తుఫాన్ తో విపరీతంగా వర్షాలు కురవడంతో జిల్లాలో సాగు చేసిన 2,300 హెక్టార్లలోని సజ్జ, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, మిరప, వరి, పెసర, పొగాకు పంటలకి నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోయిన రైతుల వివరాలను సమగ్రంగా సేకరించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవటం జరుగుతుందన్నారు. తుఫాన్ కారణంగా పాడైపోయిన రోడ్ల పునర్నిర్మాణ అంచనాలు వేస్తున్నట్లు తెలిపారు. అంచనాలు పూర్తయిన వెంటనే రోడ్లను పునర్నిమిస్తామన్నారు. తుఫాన్ సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడడంలో జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకు అందరి సేవలు అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తుఫాన్ విపత్కర పరిస్థితిలో కూడా వారి విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా పనిచేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గార్ల పర్యవేక్షణ, ఆర్.టి.జి.ఎస్ నిర్వహణ మూలంగానే విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తూ అధికారులతో ప్రజలకు సహాయక చర్యలలో అందుబాటులో ఉంచారన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి నిత్యవసర వస్తువులు సరఫరా చేసి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట కనిగిరి ఆర్డిఓ.కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
