ఇంద్రఖీలాద్రి దుర్గగుడిలో తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగింత.


 ఇంద్రఖీలాద్రి దుర్గగుడిలో తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగింత.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.

విజయవాడ: అక్టోబర్ 12  ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో  తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగింత. ముఖ్యమంత్రి కార్యాలయ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన  ఏఎస్ఐ సమయస్ఫూర్తితో  బాలుడిని పట్టుకుని ఆలయ అధికారులు, పోలీసుల సమక్షంలో తల్లికి సురక్షితంగా అప్పగించారు.

జగ్గయ్యపేటకు చెందిన లావణ్య అనే మహిళ తన 4 ఏళ్ల కుమారుడు  శశి వజ్ర ఆరూష్‌తో కలిసి ఆదివారం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఏడవ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరూష్ తల్లికి దూరమయ్యాడు. లావణ్య తన కుమారుడి కోసం మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికినా కనపడకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ ఆర్ వి.సత్యనారాయణ  అమ్మవారి దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఒక బాలుడు అనుమానస్పద రీతిలో కనిపించగా  ఏఎస్ఐ సత్యనారాయణ ఆ బాలుడిని తన వద్దకు తీసుకుని వెంటనే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాస్ నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి, బాలుడి తల్లి లావణ్యను గుర్తించి, వారి సమక్షంలో బాలుడు శశి వజ్ర ఆరూష్‌ను తల్లికి సురక్షితంగా అప్పగించారు.

సమయస్ఫూర్తితో బాలుడిని అప్పగించిన ఏఎస్ఐ ఆర్ వి.సత్యనారాయణను ఆలయ ఈఓ, చైర్మన్ అభినందించారు. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Add


Post a Comment

Previous Post Next Post