నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన – ఇన్స్పెక్టర్ గోవింద్ రావు.


 నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన – ఇన్స్పెక్టర్ గోవింద్ రావు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

 అనకాపల్లి (నర్సీపట్నం), అక్టోబర్ 12: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ రావు రౌడీషీటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ — ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతి భద్రతలను కాపాడుతూ సమాజంలో మంచి ప్రవర్తనతో జీవించాల్సిందిగా సూచించారు.

రౌడీషీటర్లు మార్పు చాటుకోవాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ తరఫున వారిని సత్సంప్రదాయాల వైపు నడిపించే కృషి నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.

Add


Post a Comment

Previous Post Next Post