జాతీయ ఏక్తా దివాస్ వేడుకలను విజయవంతం చేయండి.

జాతీయ ఏక్తా దివాస్ వేడుకలను విజయవంతం చేయండి.

 తెలంగాణ.క్రైమ్ 9 మీడియా..మంచిర్యాల జిల్లా ప్రతినిధి..

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా" రన్ ఫర్ యూనిట్ "మందమర్రి పోలీస్ ఆధ్వర్యంలో 2 కె రన్ కార్యక్రమంలో పాల్గొనాలని మందమర్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతo చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశారు. భారతదేశ ఐక్యతకు ప్రతీక ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని "జాతీయ ఏక్తా దివాస్" వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పే" రన్ ఫర్ యూనిటీ "కార్యక్రమాన్ని మందమరి పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు 31న తలపెట్టిన 2కే రన్ ఉదయం 7 గంటలకు సింగరేణి గ్రౌండ్లో ప్రారంభమవుతుందని మందమర్రి పట్టణ ప్రజలందరూ యువతీ యువకులు అధిక సంఖ్యలో 2కే రన్ లో పాల్గొనాలని మందమర్రి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వందలాది స్వదేశీ సంస్థానాలను భారతదేశం లో విలీనం చేసి దేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజనీతిజ్ఞతగా నేడు మనం చూస్తున్నా, సమగ్ర భారతదేశం సాధ్యమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశభక్తికి త్యాగానికి అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంచాలని ఆయన ఆశయం నేటికి మనందరికీ స్ఫూర్తినిస్తుందని "రన్ ఫర్ యూనిట్" ద్వారా సర్దార్ పట్టి లాస్ చేయాలని స్మరించుకుంటూ దేశ సమగ్రతను ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మందమర్రి పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేశారు.
 

Post a Comment

Previous Post Next Post