ప్రకాశం జిల్లాను సందర్శించిన రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్.



 ప్రకాశం జిల్లాను సందర్శించిన రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఒంగోలు,మొంథా తుపాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి, చేపట్టిన చర్యలు అభినందనీయమని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ లంకా దినకర్.పేర్కొన్నారు. 

గురువారం ఉదయం మొంథా తుపాను నేపధ్యంలో ఒంగోలు కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ లంకా దినకర్ సందర్శించి క్షేత్ర స్థాయిలో చేపడుతున్న తుఫాన్ సహాయక కార్యక్రమాలు, జరిగిన నష్టాలపై సంబంధిత అధికారులను నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా తుఫాన్ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, చైర్మన్ కు వివరించారు.  

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. 

ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు. సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు వలన నష్ట నివారణ తగ్గించగలగడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు కచ్చితంగా పాటిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం స్పూర్తిదాయకంగా పనిచేయడంతో ప్రకాశం జిల్లాలో ప్రాణ నష్టం జరగలేదన్నారు. తుఫాన్ సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖల సిబ్బందిని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తుఫాన్ సహాయక కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత 5 మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం జరగాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలో 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 3104 మందిని, కనిగిరి డివిజన్ పరిధిలో 47 పునరావాస కేంద్రాలను 1854 మందిని అలాగే మార్కాపురం డివిజన్ పరిధిలో 47 పునరావాస కేంద్రాలను 1854 మందిని దాదాపు 5వేల మందికి పైగా తుఫాన్ బాధితులను పునరావాస కేంద్రాలను తరలించి, వారికి కావల్సిన భోజన వసతులు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను అందించడం జరిగిందన్నారు.    

అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, వయస్సు పైబడిన వారిని, పిల్లలను గుర్తించి వారికి వైద్య సేవలు సకాలంలో అందేలా, వారి ఇళ్ళ వద్దకే ఆహారాన్ని అందించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. గడిచిన రెండు మూడు నెలల నుండి పోతురాజు కాలువకు పుడిక తీత పనులు చేపట్టడం వలన తుఫాన్ సమయంలో వరద నీరు సులువుగా వెళ్ళిపోవడం జరిగిందన్నారు. లేక పోవడంతో పెద్ద ఎత్తున కాలనీలు మునిగిపోయే పరిస్థితి కలిగేదన్నారు. ఒంగోలు శాసన సభ్యులు. దామచర్ల జనార్ధన రావు. తుఫాన్ సమయంలో స్పూర్తిదాయకంగా పనిచేస్తూ ఒంగోలు నగరంలో తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఒంగోలు నగర ప్రజలకు భరోసా కల్పించారన్నారు. జవహర్ నవోదయ పాటశాల నీట మునిగి పిల్లలు ఇబ్బందులు పడుతుంటే సుమారు 400 మంది పిల్లలకు శాసన సభ్యుల సహాయ సహకారాలతో బోజన వసతి కల్పించారన్నారు.   

 తుఫాన్ సమయంలో, తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ముఖ్యంగా తుపాన్ అనంతరం అంటు వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య ఏర్పాట్లు తో పాటు వైద్య బృందాలు క్షేత్ర స్థాయిలో పనిచేసేలా దృష్టి సారించాల్సిన అవసరం వుందని, ఈ ఏర్పాట్లు పై ఇప్పటికే జిల్లా యంత్రాంగం దృష్టి సారించడం జరిగిందన్నారు. మొత్తం 112 పునరావాస కేంద్రాల్లో 5393 మందిని సురక్షితంగా ఉంచడం జరిగిందన్నారు. అందులో 2,522 మంది పురుషులు, 2, 871 మంది స్త్రీలు ఉన్నారన్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు జిల్లాలో 215 ఇల్లు దెబ్బతినగా, అందులో పక్కా ఇళ్ళకు సంబంధించి ఒక ఇల్లు పూర్తిగా, 14 ఇల్లు పాక్షికంగా, కచ్చా ఇళ్ళకు సంబంధించి 46 ఇల్లు పూర్తిగా, 126 ఇల్లు పాక్షికంగా, పురిగుడేసలకు సంబంధించి 28 ఇల్లు పూర్తిగా, దెబ్బతిన్నాయన్నారు. వీరికి అవసరమైనటువంటి ఆహార సదుపాయాలు, ప్రొవిజన్స్ అందచేయడం జరుగుచున్నదన్నారు. తుఫాన్ సమయంలో ఆర్టీసి వారిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.

 లోతట్టు ప్రాంతంలో నిలిచిన వర్షం నీటిని తొలగించేలా అధికారులు త్వరిగతిన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. 

 వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రాధమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,274 హెక్టార్ల పంట దెబ్బ తినడం జరిగిందని తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా 51, 931 హెక్టార్ల పంట సాగు చేయడం జరిగిందన్నారు.   

  పశువులకు సంబంధించి 27 పశువులు చనిపోవడం జరిగిందన్నారు. ఎక్కడైనా పలానా నష్టం జరిగింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన వెంటనే అన్నీ శాఖలు సత్వరం స్పందిస్తూ వాటిని సరిచేయడం జరిగిందన్నారు.  

ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో తుఫాన్ సహాయక చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.    

తుఫాన్ సమయంలో జిల్లా ప్రత్యేక అధికారి.కోన.శశిధర్, జోనల్ ప్రత్యేక అధికారి సుసోడియా గార్లు.జిల్లాలో పర్యటించి అధికారులకు తగు సూచనలు, చేయడం జరిగింది.

  ఇంతటి ఇపత్తులో కూడా విద్యుత్ అంతరాయం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం కృషి చేశారన్నారు. మొంథా తుపాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి, చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post