వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
క్రైమ్ 9 మీడియా.బి. రవికుమార్.తెలంగాణ ప్రతినిధి. అక్టోబర్ 30.
తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు .వరద ప్రభావిత ప్రాంతాలకు పడవలను పంపించాలని జిల్లాలో అందుబాటులో ఉన్న ఎస్. డి .ఆర్ .ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డి.జి.పి కి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసరమైన అవసరాల కోసం హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న సాయక చర్యల సామాగ్రిని వినియోగించుకోవాలని ఆదేశించారు.
వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరద ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు బంగ్లాలో చిక్కుకున్న కుటుంబాలకు రెండు ధర అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. మంచినీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థను అప్రమత్తంగా గా ఉండాలని ఆదేశించారు .ఎటువంటి లోడ్ పాటలు జరగకుండా అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరగకుండ సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ జిల్లా పార్టీల వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి గురువారం వరంగల్ ,హుస్నాబాద్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని ,వరద బాధిత ప్రాంతాల్లో ఏరియా సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు.
