తుపాన్ బాధితులకు స్వయంగా భోజనాలు వడ్డించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యస్ పి,
నెల్లూరు రూరల్ పరిధిలోని కొండ్లపూడిలోని పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా,ఐఏఎస్., గారితో కలిసి సందర్శించిన జిల్లా యస్.పి.అజిత వేజెండ్ల . అనంతరం బాధితులకు స్వయంగా భోజనాలు వడ్డించి, భోజనం చేశారు. అనంతరం వారితో ముచ్చటించి, పరిస్థితులను ఆరా తీసారు.
అంతేకాకుండా నెల్లూరు టౌన్ లోని సంతపేట పరిధిలోని గాంధీ గిరిజన సంఘంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని స్వయంగా సందర్శించిన జిల్లా యస్.పి.
మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రమాదపు హెచ్చరికలు ఉన్న ప్రాంతాలను సుడిగాలి పర్యటన చేస్తూ, అక్కడ అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సహాయ చర్యలపై సూచనలు చేస్తున్న యస్.పి.
జిల్లా వ్యాప్తంగా 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు.. సుమారు 4199 పైగా బాధితులను తరలించి, వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అన్ని విధాల సహాయక చర్యలు చేయుటకు సిద్దంగా ఉంది. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
పెన్నా నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలలోని బాధితులకు, పోలీస్, సహాయ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు.
పునరావాస కేంద్రాల తరలింపులో ప్రజల సహకారం చాలా బాగుంది.. ఇంకా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24x7 అందుబాటులో ఉంటారు.
