గిద్దలూరు నియోజకవర్గం లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు.నిండుకుండలా కంభం చెరువు.

గిద్దలూరు నియోజకవర్గం లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు.నిండుకుండలా కంభం చెరువు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మూంథా తుఫాను ప్రభావంతో జిల్లాలోని భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గం ఆరు మండలాలలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమల అడవి ప్రాంతంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి పొగపడ. ఇసుక రేవు మీదుగా ఉదృతంగా ప్రవహిస్తున్న జంపలేరు. బొల్లుపల్లె. పాపినేనిపల్లి. అర్ధవీడు. దొనకొండ. అయ్యవారిపల్లి. పెద్ద కందుకూరు. మొహిద్దిన్ పురం.మీదుగా ప్రవహిస్తూ. శ్రీకృష్ణదేవరాయలు సతీమణి వరదరాజ్యమ్మ కట్టించిన కంభం చెరువుకు చేరుకున్నాయి.. అలాగే. చోళ వీడు నుండి ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు. ఎర్రబాలెం నల్లగాలువ. మరియు. రావిపాడు పాపయ్య పల్లె. వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. బేస్తవారిపేట మండలం కోనపల్లె చెరువు నిండుకుండలా నిండింది. రోడ్లన్నీ జలమయం అవటంతో పొగుళ్ల గ్రామానికి రాకపోకలు నిలిచాయి. గిద్దలూరు సాగిలేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంభం తురిమెల్లా రోడ్లు జలమయంతో రాకపోకలు నిలిచాయి. 

 జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గం లో ఉన్నటువంటి రెవిన్యూ . పోలీసు .గ్రామ పంచాయితీ సిబ్బంది ప్రజా శ్రేయస్సుకోసం. ప్రజా సమస్యలు మా సమస్యలుగా బాధ్యతగా ప్రజల కోసం కష్టపడుతూ భారీ వర్షాలను. లెక్కచేయకుండా. బందోబస్తు నిర్వహిస్తూ. . ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలను ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు. గ్రామ ప్రజలకు అధికారులు తెలియజేశారు.అనంతరం కంభం చెరువు అలుగును స్థానిక కంభం తహసీల్దార్ వి. కిరణ్ కుమార్. కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. బి నరసింహారావు. మరియు నీటి పారుదల శాఖ ఏఈ. రెవెన్యూ సిబ్బంది. పోలీస్ సిబ్బంది తదితరులు. పరిశీలించడం జరిగింది. అలాగే సోమవారి పేట సమీపంలోని సీకిరేని కత్వ నిండుకుండలా చెరువుల తలపిస్తుంది. బేస్తవారిపేట చిన్నకంబం మధ్యలో నుండి ఉప్పు వాగు ఉదృతంగా ప్రవహించి సీకిరేనికత్వకు వచ్చిన నేపథ్యంలో బేస్తవారిపేట తహసిల్దార్ జితేంద్ర. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షించారు అనంతరం సికిరేణి కత్వ పరివాహక ప్రాంతంలోని లో తట్టు గ్రామాలను పరిశీలించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పత్రికా విలేకరులు నీటిపారుదల శాఖ అధికారులను కంభం చెరువుకు శికిరేని కతవకు ఎన్ని టీఎంసీ నీరు వచ్చాయని. ఎన్ని క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు సీకిరేణి కత్వ లో ఉన్నటువంటి తూము పటిష్టంగా ఉందా బలహీనంగా ఉందాని విలేకరి అడిగిన ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పకుండా దాటవేసి వెళ్ళిపోయారు. బెస్తవారిపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Add



 

Post a Comment

Previous Post Next Post