చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బీఆర్ గవాయ్ పై మతోన్మాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వివిధ నాయకులు.
దేశంలో కుల వివక్షత ఏ స్థాయిలో ఉందో గవాయి గారి పైన దాడి ప్రత్యక్ష ఉదాహరణ.
దళిత వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినందుకు తట్టుకోలేని ఆదిపత్య కులాల మనువాదుల కుట్ర.
దేశ సార్వభౌమత్వానికి విఘాతమని, సనాతన ముసుగులో మతోన్మాద శక్తులు చేస్తున్న అరాచకమని అభ్యుదయ మేధావి వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 08: తిరుపతి. క్రైమ్ 9 మీడియా ప్రతినిధి- దిలీప్.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద పరమ పూజ్యబోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం వద్ద పూలమాలతో నివాళులర్పింన అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం మరియు బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శాఖ వారు పెద్ద ఎత్తున శ్రీ బీఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గారి పైన మతోన్మాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆచార్య పిసి వెంకటేశ్వర్లు మరియు డిప్యూటీ రిజిస్టర్ ఇంజనీరింగ్ విభాగం పెద్దలు దామల నాయక్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చింతమాకుల పాల్గొన్నారు . వారందరూ మాట్లాడుతూ ఈ దేశంలో కుల వివక్షత ఏ స్థాయిలో ఉందో గవాయి గారి పైన దాడి ప్రత్యక్ష ఉదాహరణ అని, ఇది రాజ్యాంగం మీద దాడి ,ప్రజాస్వామ్యం మీద దాడి,లౌకికం వాదం మీద దాడి, మరియు దేశ సార్వభౌమత్వానికి విఘాతమని, సనాతన ముసుగులో మన మతోన్మాద శక్తులు చేస్తున్న అరాచకమని దీనిని అభ్యుదయ మేధావి వర్గాలు ప్రజలందరూ ప్రతిఘటించాలని తద్వారా మాత్రమే భారతదేశం యొక్క గౌరవం ప్రపంచ దేశాల్లో ఇనుమడింప చేస్తారని తెలియజేశారు.ఒక దళిత వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినందుకు తట్టుకోలేని ఆదిపత్య కులాల మనువాదుల కుట్రలో భాగమే ఇది అని పునరుద్ఘాటించారు. మతపరమైన తీర్పుల్లో ఆధిపత్య వర్గాల సంబంధించి ప్రధాన న్యాయమూర్తుల గతంలో తీర్పులు రాజ్యాంగానికి లోబడి ఉన్న ఆరోజు ఏ న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి పైన ఇలాంటి దాడులు చేయలేదు కేవలం దళిత బౌద్ధ మతానికి సంబంధించిన గవాయి ని దాడి చేయడం ఇది ముమ్మాటికి కుల వివక్షత, మనస్ఫూర్తి విధానాలు మాత్రమే అని తెలియజేశారు. భవిష్యత్తులో మతోన్మాదుల ఆగడాలను దేశ ప్రజలు తుద ముట్టించాలలని పేర్కొన్నారు.
