నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి జరిమానా.


 

నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి జరిమానా.

ఆంధ్రప్రదేశ్ : నటుడు మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. మోహన్ బాబు యూనివర్సిటీపై ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ.26 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు విచారణలో నిజమని తేలింది. అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Post a Comment

Previous Post Next Post