ఎస్. టి. పి మార్చాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే.


 ఎస్. టి. పి మార్చాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే.

క్రైమ్ 9 మీడియా.. అక్టోబర్, 29. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బాగాయాత్ పరిధిలోని మంజూరైన ఎస్. టి .పి మురుగునీటి శుద్ధి కర్మాగారం మార్చాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజిగిరి ఎం.పీ ఈటెల రాజేందర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. పరిధిలోని కుర్మానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనరసింహ నగర్, సమాధానం సొసైటీ నిర్వాసితులు తీవ్రమైన అభ్యంతరాలకు ప్రజలకు, తీవ్రమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఎస్. టి. పి కర్మాగారం మార్చాలని ఎంపీకి వినతిపత్రం అందించారు. ఎన్నో సంవత్సరాలుగా 2000 కుటుంబాలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నాయని ఈ నివాస స్థలంలో కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసన వస్తుందని దాని ద్వారా వచ్చే వాసన ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని ,మరియు పర్యావరణ కాలుష్యం సంభవిస్తుందని తద్వారా వారి ఆరోగ్య శ్రేయస్సు కోసం ఆలోచన చేయాలని, ప్రజలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మురుగునీటి శుద్ధి కర్మాగారం స్థలం వేరే మార్చాలని పున: పరిశీలించి వేరే స్థలానికి పరిశీలించాలని ఎంపీని ఎమ్మెల్యే సందర్భంగా కోరడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post