తుఫాను ప్రభావం పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి ఆదేశాలు జారీ.


 తుఫాను ప్రభావం పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 

సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి ఆదేశాలు జారీ.

క్రైమ్ 9మీడియా.. తెలంగాణ ప్రతినిధి అక్టోబర్ 29. మొoథా తుఫాన్ ప్రభావం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .వరి కోతల సమయం కావడంతో పలుచోట్ల కల్లాల్లో దాన్యం ఆరబోసి నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రంలో తగిన ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు జరగకుండా అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో మింతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో భారీ వర్షం కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో మహబూబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైలు దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలలో ఎస్. డి. ఆర్ ఎఫ్. ఎన్ .డి .ఆర్ .ఎఫ్ పోలీస్ బృందాల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సంబంధిత అధికారులకు మార్గదర్శకత్వం వహించాలని సూచించారు పొంగి ప్రమాదం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను, కుటుంబాలను సహాయక చర్యలలో భాగంగా శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తంగా సహాయక చర్యలో పలు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితమైన ప్రాంతంలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు సిబ్బంది రిజర్వాయర్లు చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు క్షేత్రస్థాయిలో సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగానే సిద్ధం చేయాలని రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లెవెల్ బ్రిడ్జిలు కాజు వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు సమీపంలో భారీ కెడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధిక ఆదేశించారు. తుఫాను ప్రభావంతో వర్షం నీరు నిల్వ ఉండి దోమలు ఇతర క్రిమికిటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున పురపాలక, గ్రామ పారిశుద్ధ సిబ్బందికి ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు దగ్గర ఉండి చేపట్టాలని అన్నారు. వైద్య ,ఆరోగ్యశాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకొని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ జాగ్రత్తలు వహించాలని అన్నారు. రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ ఆర్, అండ్, బి, పోలీస్ అగ్నిమాప, శాఖలు జి.హెచ్.ఎం.సి, హైడ్రా. సిబ్బంది తక్షణమే సత్వరమే అప్రమత్తంగా ఉండాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులు ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post